← All topic notes

మహాభినిష్క్రమణం, కఠోర సాధన మరియు సంబోధి (జ్ఞానోదయం)

By exambadi.inNote 11 / 33

సిద్ధార్థుడు రాజభోగాలను త్యజించి పరమ సత్యం కోసం అన్వేషించి చివరకు సంపూర్ణ జ్ఞానిగా (బుద్ధుడిగా) అవతరించిన మహోజ్వల ఘట్టమిది.

  • మహాభినిష్క్రమణం (The Great Renunciation):
    1. 29వ ఏట అర్థరాత్రి తన ప్రియమైన గుర్రం 'కంథక', సారథి చెన్నతో కలిసి రాజభవనాన్ని వీడి వెళ్ళిపోయాడు; బౌద్ధ సంప్రదాయంలో దీనిని 'మహాభినిష్క్రమణం' అంటారు.
    2. తొలుత వైశాలి వద్ద సాంఖ్య గురువైన 'అలార కలామ' వద్ద, తర్వాత రాజగృహ వద్ద 'రుద్రక రామపుత్ర' వద్ద ధ్యాన పద్ధతులను అభ్యసించాడు.
  • నిరంజన నదీ తీర తపస్సు:
    1. ఐదుగురు బ్రాహ్మణ సన్యాసులతో (కొండన్న బృందం) కలిసి ఉరువేల అడవులలో ఆరు సంవత్సరాల పాటు శరీరాన్ని శుష్కింపజేసే కఠోర నిరాహార తపస్సు చేశాడు; చివరకు అది వ్యర్థమని గ్రహించి 'సుజాత' అనే గోపిక ఇచ్చిన పరమాన్నాన్ని స్వీకరించి మధ్యేమార్గాన్ని ఎంచుకున్నాడు.
  • నిర్వాణం / సంబోధి (Enlightenment):
    1. 35వ ఏట గయలో నిరంజన (నేటి ఫల్గు) నదీ తీరాన బోధి వృక్షం (రావి చెట్టు) కింద 49 రోజుల ధ్యానం తర్వాత వైశాఖ పౌర్ణమి నాడు పరమోన్నత జ్ఞానాన్ని పొందాడు.
    2. నాటి నుండి ఆయన 'బుద్ధుడు' (జ్ఞానోదయం పొందినవాడు), 'తథాగతుడు' (సత్యాన్ని చేరినవాడు), 'శాక్యముని'గా ప్రసిద్ధి చెందాడు.