బౌద్ధ సాహిత్యం ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రాలను తెలుసుకోవడానికి అత్యంత ప్రామాణికమైన సమాచార నిధి.
- త్రిపీటకాలు (పాలి భాషలోని పవిత్ర సంపుటాలు):
- వినయ పీటకం (ఉపాలి): పాతిమోక్క (సన్యాస నియమాలు), సుత్తవిభంగ, ఖంధక, పరివార అనే విభాగాలు ఉన్నాయి.
- సుత్త పీటకం (ఆనందుడు): బుద్ధుని బోధనలు; ఐదు నికాయలుగా విభజించబడింది (దీఘ, మజ్జిమ, సంయుక్త, అంగుత్తర, ఖుద్దక నికాయలు); అంగుత్తర నికాయ 16 మహాజనపదాల వివరాలను ఇచ్చింది; ఖుద్దక నికాయలో ధమ్మపదం, జాతక కథలు ఉన్నాయి.
- అభిధమ్మ పీటకం (తిస్స): బౌద్ధ తాత్విక విశ్లేషణ; ఇందులో ధమ్మసంగణి, కథావత్తు ముఖ్యమైనవి.
- జాతక కథలు:
- బుద్ధుని పూర్వ జన్మల గురించి వివరించే 549 నీతి కథలు; నాటి వర్తక శ్రేణులు, నాణేలు, సామాజిక వాస్తవాలను ఇవి కళ్ళకు కడతాయి.
- ఇతర ప్రముఖ బౌద్ధ గ్రంథాలు:
- మిళిందపన్హా (Milindapanha): గ్రీకు రాజు మీనాండర్ (మిళిందుడు) మరియు బౌద్ధ సన్యాసి నాగసేనుని మధ్య జరిగిన తాత్విక సంవాదం.
- దీపవంశ, మహావంశ: శ్రీలంక చారిత్రక బౌద్ధ గ్రంథాలు; అశోకుని కాలం నాటి విశేషాలను తెలుపుతాయి.
- సంస్కృత బౌద్ధ గ్రంథాలు: అశ్వఘోషుడు రచించిన 'బుద్ధచరితం' (తొలి సంస్కృత బుద్ధ కావ్యం), 'సౌందరనందం'; నాగార్జునుని 'మూలమాధ్యమిక కారిక'.
