← All topic notes

జైన తత్వశాస్త్రం - అనేక్యాంతవాదం, స్యాద్వాదం మరియు ఆత్మ సిద్ధాంతం

By exambadi.inNote 06 / 33

జైన తత్వశాస్త్రం హేతుబద్ధమైన, బహుముఖ దృక్పథాన్ని కలిగి ఉండి విశ్వ స్వభావాన్ని విశ్లేషిస్తుంది.

  • అనేక్యాంతవాదం (వివిధ కోణాల సిద్ధాంతం):
    1. ఏదైనా ఒక వస్తువు లేదా సత్యం అనంతమైన కోణాలు, లక్షణాలు కలిగి ఉంటుందని ఇది చెబుతుంది; మానవ జ్ఞానం పరిమితమైనది కాబట్టి ఒకేసారి సమగ్ర సత్యాన్ని గ్రహించలేడు.
    2. గుడ్డివారు ఏనుగును స్పర్శించి వేర్వేరు భావనలు ఏర్పరచుకున్న ఉపమానం అనేక్యాంతవాదాన్ని వివరిస్తుంది.
  • స్యాద్వాదం (సాపేక్షతా వాదం):
    1. ఏ నిర్ధారణ అయినా నిర్దిష్ట కోణంలోనే సరైనదని తెలిపే తార్కిక ప్రక్రియ; ఏ వాక్యం ముందైనా 'స్యాత్' (ఒకవేళ/ఒక కోణంలో) అనే పదాన్ని చేర్చాలి; ఇందులో ఏడు రకాల ప్రతిపాదనలు (సప్తభంగినయం) ఉంటాయి.
  • ఈశ్వర నిరాకరణ మరియు జీవ-అజీవ ద్వైతం:
    1. జైనం సృష్టికర్తగా దేవుడి ఉనికిని అంగీకరించదు; విశ్వం అనాదిగా తన సహజ నియమాలతో నడుస్తోంది.
    2. తీర్థంకరుల స్థాయిని దేవుడి కంటే ఉన్నతంగా పరిగణిస్తారు.
    3. విశ్వం 'జీవ' (చేతన/ఆత్మ), 'అజీవ' (జడ/పుద్గల) పదార్థాల కలయిక; రాళ్ళు, నీరు, వృక్షాల వంటి నిర్జీవ వస్తువులలో సైతం ఆత్మ ఉంటుందని జైనం నమ్ముతుంది.
  • సల్లేఖన వ్రతం (నిష్ఠాపూర్వక ఉపవాస మరణం):
    1. శరీరం కృశించిపోయేలా ఆహార పానీయాలను క్రమంగా త్యజిస్తూ ధ్యానంలో ప్రాణత్యాగం చేయడాన్ని 'సల్లేఖన' (Santhara) అంటారు; చంద్రగుప్త మౌర్యుడు శ్రావణబెళగొళలో దీని ద్వారానే దేహత్యాగం చేశాడు.