పురావస్తు తవ్వకాల్లో లభ్యమైన కర్బన అవశేషాలు, మట్టిపాత్రలు, రాళ్ల కాలాన్ని కచ్చితంగా గణించడానికి ఆధునిక భౌతిక, రసాయన పద్ధతులు వినియోగించబడుతున్నాయి.
- రేడియోకార్బన్ డేటింగ్ (C-14): విల్లార్డ్ లిబ్బీ 1949లో కనుగొన్న ఈ పద్ధతి ద్వారా కర్బన పదార్థాలైన ఎముకలు, చెక్క, బొగ్గుల కాలాన్ని లెక్కిస్తారు. కార్బన్-14 అర్ధజీవిత కాలం సుమారు 5,730 సంవత్సరాలు. దీని ఆధారంగా సుమారు 50,000 సంవత్సరాల వరకు గల వస్తువుల వయస్సును నిర్ధారిస్తారు.
- థర్మోల్యూమినిసెన్స్ (TL Dating): కాల్చిన మట్టి పాత్రలు (Pottery), ఇటుకలు చివరిసారిగా ఎంత కాలం క్రితం వేడి చేయబడ్డాయో తెలుసుకోవడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.
- డెండ్రోక్రోనాలజీ మరియు పొటాషియం-ఆర్గాన్: చెట్ల కాండాల వార్షిక వలయాలను లెక్కించడం ద్వారా కాలాన్ని డెండ్రోక్రోనాలజీ లెక్కిస్తుంది. మిలియన్ల సంవత్సరాల నాటి ప్రాచీన శిలలు, ఆదిమ మానవ శిలాజాల కోసం పొటాషియం-ఆర్గాన్ (K-Ar) పద్ధతిని ఉపయోగిస్తారు.
