గుప్తుల కాలాన్ని 'సంస్కృత సాహిత్య స్వర్ణయుగం' అని పిలుస్తారు. ప్రాకృతం స్థానంలో సంస్కృతం సామ్రాజ్య అధికార భాషగా సర్వోన్నత శిఖరాలను అధిరోహించింది.
- మహాకవి కాళిదాసు గ్రంథాలు:
- నాటకాలు (3): 1. అభిజ్ఞాన శాకుంతలం (విశ్వవిఖ్యాత నాటకం - దుష్యంతుడు, శకుంతల ప్రణయ కథ; 1789లో సర్ విలియం జోన్స్ దీనిని ఆంగ్లంలోకి అనువదించాడు), 2. మాళవికాగ్నిమిత్రం (శుంగ రాజు అగ్నిమిత్రుని కథ), 3. విక్రమోర్వశీయం (పురూరవుడు, ఊర్వశి కథ).
- మహాకావ్యాలు (2): 1. రఘువంశం (శ్రీరాముని ఇక్ష్వాకు వంశ చరిత్ర), 2. కుమారసంభవం (శివపార్వతుల వివాహం మరియు కుమారస్వామి జననం).
- ఖండకావ్యాలు/గీతికవ్యాలు (2): 1. మేఘదూతం (యక్షుడు మేఘం ద్వారా ప్రియురాలికి పంపిన సందేశం), 2. ఋతుసంహారం (ఆరు ఋతువుల ప్రకృతి వర్ణన).
- ఇతర ప్రముఖ నాటకకర్తలు మరియు గ్రంథాలు:
- విశాఖదత్తుడు: 'ముద్రారాక్షసం' (మౌర్య చంద్రగుప్తుడు, చాణక్యుని రాజకీయ వ్యూహాలు - శృంగార రసం లేని రాజకీయ నాటకం), 'దేవీచంద్రగుప్తం' (రామగుప్తుడు, ధ్రువదేవి, రెండవ చంద్రగుప్తుని కథ).
- శూద్రకుడు: 'మృచ్ఛకటికం' (మట్టిబండి - పేద బ్రాహ్మణుడు చారుదత్తుడు, వేశ్య వసంతసేనల ప్రేమకథ; వాస్తవిక సామాజిక నాటకం).
- భాసుడు: 'స్వప్నవాసవదత్త', 'దరిద్ర చారుదత్త'.
