← All topic notes

షేర్షా సూరి పరిపాలనా మరియు ఆర్థిక సంస్కరణలు

By exambadi.inNote 07 / 30

షేర్షా కేవలం 5 సంవత్సరాలే పాలించినప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన పరిపాలనా పద్ధతులు తరువాతి కాలంలో అక్బర్‌కు మార్గదర్శకంగా నిలిచాయి.

  • పరిపాలనా విభాగాలు:
    1. రాజ్యాన్ని 47 'సర్కార్లు' (జిల్లాలు)గా విభజించాడు; ఒక్కో సర్కార్‌కు షిక్దార్-ఇ-షిక్దారన్ (శాంతిభద్రతలు), మున్సిఫ్-ఇ-మున్సిఫాన్ (న్యాయం) అధికారులు ఉండేవారు.
    2. సర్కార్లు 'పరగణాలు'గా విభజించబడ్డాయి; పరగణాలో షిక్దార్, అమీన్ (భూమి శిస్తు), ఫొతేదార్ (ఖజానాదారు), కార్కూన్లు (రాయసగాళ్లు) ఉండేవారు.
  • భూమి శిస్తు సంస్కరణలు (జబ్తీ పద్ధతి):
    1. భూమిని కొలవడానికి సికింద్రీ గజ్ (32 అంగుళాలు), జనుము తాడు (జరీబ్) వాడాడు.
    2. దిగుబడి ఆధారంగా భూమిని ఉత్తమ, మధ్యమ, అధమ తరగతులుగా వర్గీకరించాడు.
    3. రైతులకు వారి హక్కులు తెలిపే 'పట్టా' ఇచ్చేవాడు; రైతులు చెల్లించాల్సిన శిస్తును అంగీకరిస్తూ రాసిచ్చే ఒప్పంద పత్రాన్ని 'కబూలియత్' అనేవారు.
  • కరెన్సీ మరియు రహదారులు:
    1. పాత నాణేలను రద్దు చేసి స్వచ్ఛమైన వెండి నాణెం 'రూపాయా' (178 గ్రెయిన్లు) ను ప్రవేశపెట్టాడు (ఇదే నేటి భారత రూపాయికి మూలం).
    2. రాగి నాణేన్ని 'దామ్' అనేవారు.
    3. బెంగాల్‌లోని సోనార్‌గావ్ నుండి పాకిస్తాన్‌లోని పెషావర్ వరకు 2400 కి.మీ. పొడవైన 'సడక్-ఇ-ఆజమ్' (గ్రాండ్ ట్రంక్ రోడ్డు)ను నిర్మించాడు.
    4. బాటసారుల సౌకర్యార్థం ప్రతి 2 కోసులకు (సుమారు 8 కి.మీ.) ఒక సరాయి (సత్రం) నిర్మించి పక్కనే చెట్లు నాటించాడు.