పానిపట్ గెలిచిన తర్వాత తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బాబర్ రాజపుత్రులతో, ఆఫ్ఘన్లతో వరుస యుద్ధాలు చేయాల్సి వచ్చింది.
- ఖాన్వా యుద్ధం (క్రీ.శ. 1527):
- మేవార్ వీరుడు రాణా సంగాకు, బాబర్‌కు మధ్య ఆగ్రా సమీపంలోని ఖాన్వా వద్ద జరిగింది.
- సైనికుల్లో ఉత్సాహం నింపడానికి బాబర్ దీనిని 'జిహాద్' (పవిత్ర యుద్ధం)గా ప్రకటించాడు.
- మద్యపానాన్ని పూర్తిగా విరమించుకుంటానని ఒట్టు వేశాడు.
- రాణా సంగాను ఓడించిన తర్వాత బాబర్ 'గాజీ' (మత యోధుడు) బిరుదు తీసుకున్నాడు.
- చందేరి యుద్ధం (క్రీ.శ. 1528):
- మాల్వా ప్రాంత రాజపుత్ర పాలకుడు మేదినీరాయ్‌ను బాబర్ ఓడించాడు.
- ఈ యుద్ధంలో ఓడిపోయిన రాజపుత్ర స్త్రీలు 'జౌహార్' (అగ్ని ప్రవేశం) చేసుకున్నారు.
- ఘాగ్రా యుద్ధం (క్రీ.శ. 1529):
- బీహార్, బెంగాల్ ఆఫ్ఘన్ల నాయకుడైన మహమూద్ లోడీని బాబర్ ఓడించాడు.
- ఇది భూమి మీద మరియు నీటి మీద (నదిలో) ఏకకాలంలో జరిగిన తొలి యుద్ధం.
- క్రీ.శ. 1530లో బాబర్ ఆగ్రాలో మరణించాడు; మొదట ఆగ్రాలోని ఆరాంబాగ్ లో, తర్వాత ఆయన కోరిక మేరకు కాబూల్‌లో ఖననం చేశారు.
