← All topic notes

మొఘల్ సామ్రాజ్యం

By exambadi.inNote 01 / 30

మధ్య ఆసియా నుండి వచ్చిన బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వీరు తండ్రి వైపు తైమూర్ వంశానికి, తల్లి వైపు చెంగిజ్‌ఖాన్ వంశానికి చెందినవారు.

  • బాబర్ నేపథ్యం:
    1. బాబర్ పూర్తి పేరు జహీరుద్దీన్ ముహమ్మద్ బాబర్.
    2. బాబర్ అంటే టర్కీ భాషలో 'పులి' అని అర్థం.
    3. ఈయన క్రీ.శ. 1483లో మధ్య ఆసియాలోని ఫర్ఘానా లోయలో జన్మించాడు.
    4. కేవలం 11 సంవత్సరాల వయసులోనే ఫర్ఘానా పాలకుడయ్యాడు.
  • సమర్కండ్ పోరాటాలు మరియు కాబూల్ ఆక్రమణ:
    1. తన పూర్వీకుల రాజధాని సమర్కండ్‌ను గెలవడానికి బాబర్ అనేకసార్లు పోరాడాడు.
    2. అక్కడ ఉజ్బెక్ నాయకుడు షైబానీ ఖాన్ చేతిలో ఓడిపోయాడు.
    3. చివరకు క్రీ.శ. 1504లో ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌ను ఆక్రమించుకుని స్థిరపడ్డాడు.
    4. కాబూల్ నుండి భారత్ వైపు దృష్టి సారించాడు.