← All topic notes

మొఘల్ పరిపాలనా వ్యవస్థ - స్థానిక మరియు న్యాయ పాలన

By exambadi.inNote 27 / 30

మొఘలులు ఒక క్రమబద్ధమైన కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థను క్షేత్రస్థాయి వరకు నిర్మించారు.

  • పరిపాలనా క్రమం (ఆరోహణ నుండి అవరోహణ):
    1. సామ్రాజ్యం (కేంద్రం - అధిపతి బాద్షా / చక్రవర్తి)
    2. సుబా (రాష్ట్రం - అధిపతి సుబేదార్ / సిపాహ్‌సాలార్)
    3. సర్కార్ (జిల్లా - అధిపతి ఫౌజ్దార్)
    4. పరగణా (తాలూకా - అధిపతి షిక్దార్)
    5. గ్రామ (ప్రాథమిక విభాగం - అధిపతి ముఖద్దమ్ / గ్రామ పెద్ద).
  • ముఖ్య స్థానిక అధికారులు:
    1. ఫౌజ్దార్: సర్కార్ (జిల్లా) సైనిక అధికారి, శాంతిభద్రతల పరిరక్షకుడు.
    2. అమల్ గుజార్: సర్కార్ స్థాయిలో భూమి శిస్తు వసూలు చేసే ప్రధాన రెవెన్యూ అధికారి.
    3. కొత్వాల్: నగరంలో అంతర్గత శాంతిభద్రతలు, రాత్రి గస్తీ, మార్కెట్ ధరలను నియంత్రించే నగర పోలీస్ కమిషనర్.
    4. పట్వారీ: గ్రామ స్థాయిలో భూ రికార్డులు రాసే అధికారి.
  • న్యాయ వ్యవస్థ:
    1. చక్రవర్తి అత్యున్నత న్యాయాధికారి; ప్రతి బుధవారం నేరుగా న్యాయ విచారణ చేసేవాడు.
    2. ప్రధాన న్యాయాధికారిని 'ముఖ్య ఖాజీ' (ఖాజీ-ఉల్-ఖుజాత్) అనేవారు.