← All topic notes

మొదటి పానిపట్ యుద్ధం మరియు మొఘల్ సామ్రాజ్య స్థాపన

By exambadi.inNote 02 / 30

క్రీ.శ. 1526లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంతో భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల పాలన ముగిసి మొఘల్ శకం ప్రారంభమైంది.

  • యుద్ధ నేపథ్యం మరియు ఆహ్వానం:
    1. ఢిల్లీని పాలిస్తున్న ఇబ్రహీం లోడీకి ఆయన బంధువులతోనే విభేదాలు వచ్చాయి.
    2. పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడీ, ఇబ్రహీం బాబాయ్ ఆలం ఖాన్ లోడీ బాబర్‌ను భారత్‌పైకి దండెత్తమని ఆహ్వానించారు.
    3. మేవార్ రాణా సంగ్రామ్ సింగ్ (రాణా సంగా) కూడా బాబర్‌కు ఆహ్వానం పంపాడు.
  • యుద్ధం - తుగ్లుమా మరియు తుపాకీల వ్యూహం:
    1. క్రీ.శ. 1526 ఏప్రిల్ 21న పానిపట్ వద్ద యుద్ధం జరిగింది.
    2. బాబర్ మొదటిసారిగా 'తుగ్లుమా' (సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించి శత్రువును చుట్టుముట్టే వ్యూహం) ఉపయోగించాడు.
    3. ఎడ్లబండ్లను వరుసగా కట్టి తుపాకులు పేల్చే 'రుమీ' పద్ధతిని వాడాడు.
    4. బాబర్ తుపాకీ దళానికి ఉస్తాద్ అలీ, ముస్తఫాలు నాయకత్వం వహించారు.
    5. ఇబ్రహీం లోడీ యుద్ధభూమిలోనే వీరమరణం పొందాడు.
  • విజయ ఫలితాలు:
    1. బాబర్ ఢిల్లీ మరియు ఆగ్రాలను ఆక్రమించాడు.
    2. కాబూల్ ప్రజలందరికీ ఒక్కొక్క వెండి నాణెం పంచి 'కలందర్' (దాత) అనే బిరుదు పొందాడు.