← All topic notes

షాజహాన్ పాలన మరియు మొఘల్ వాస్తుకళా స్వర్ణయుగం

By exambadi.inNote 20 / 30

జహంగీర్ తర్వాత ఆయన కుమారుడు ఖుర్రం 'షాజహాన్' (ప్రపంచ పాలకుడు) పేరుతో క్రీ.శ. 1628లో సింహాసనం అధిష్టించాడు. ఈయన కాలాన్ని 'మొఘల్ వాస్తుకళా స్వర్ణయుగం' అంటారు.

  • పాలనా విశేషాలు మరియు తిరుగుబాట్లు:
    1. బుందేలా నాయకుడు జుఝార్ సింగ్, దక్కన్ ఆఫ్ఘన్ నాయకుడు ఖాన్ జహాన్ లోడీల తిరుగుబాట్లను అణచివేశాడు.
    2. క్రీ.శ. 1632లో హూగ్లీ వద్ద విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న పోర్చుగీసు వారిని తరిమికొట్టాడు.
    3. క్రీ.శ. 1636లో దక్కన్‌లోని అహ్మద్‌నగర్ రాజ్యాన్ని పూర్తిగా మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు; బీజాపూర్, గోల్కొండ రాజ్యాలను మొఘల్ ఆధిపత్యాన్ని అంగీకరింపజేశాడు.
    4. తన కుమారుడైన ఔరంగజేబును దక్కన్ సుబేదార్‌గా నియమించాడు.
  • రాజధాని మార్పు - షాజహానాబాద్:
    1. క్రీ.శ. 1638లో రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చి యమునా తీరాన 'షాజహానాబాద్' (నేటి పాత ఢిల్లీ) నగరాన్ని నిర్మించాడు.
  • విదేశీ యాత్రికులు:
    1. ఫ్రెంచ్ వైద్యుడు బెర్నియర్, రత్నాల వ్యాపారి టావెర్నియర్, ఇటాలియన్ మనుచ్చిలు షాజహాన్ దర్బారు వైభవాన్ని వర్ణించారు.