అక్బర్ కాలంలో ఇండో-ఇస్లామిక్ శైలిలో ఎర్రరాతితో కూడిన భారీ భవనాలు నిర్మించబడ్డాయి.
- హుమాయూన్ సమాధి (ఢిల్లీ):
- హుమాయూన్ భార్య హాజీ బేగం ఆధ్వర్యంలో నిర్మించబడింది.
- పర్షియన్ శిల్పి మీరక్ మీర్జా ఘియాస్ దీనిని రూపొందించాడు.
- భారతదేశంలో మొట్టమొదటి డబుల్ డోమ్ (రెండు గుమ్మటాల) భవనం మరియు తాజ్‌మహల్‌కు నమూనాగా నిలిచింది.
- ఫతేపూర్ సిక్రీ - కొత్త రాజధాని:
- సూఫీ గురువు షేక్ సలీమ్ చిష్తీ గౌరవార్థం ఆగ్రా సమీపంలో ఫతేపూర్ సిక్రీ అనే కొత్త నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు.
- ముఖ్య కట్టడాలు:
- జోధాబాయి మహల్ (గుజరాత్-రాజపుత్ర శైలి).
- పంచమహల్ (బౌద్ధ విహార శైలిలో 5 అంతస్తుల పిరమిడ్ భవనం).
- దివాన్-ఇ-ఆమ్ మరియు దివాన్-ఇ-ఖాస్ (మధ్యలో ఏకశిలా స్తంభం కలదు).
- బీర్బల్ భవనం మరియు జామా మసీదు.
- షేక్ సలీమ్ చిష్తీ తెల్లరాతి సమాధి.
- ఇతర కోటలు:
- ఆగ్రా ఎర్రకోట, లాహోర్ కోట, అలహాబాద్ కోట మరియు అజ్మీర్ కోటలను అక్బర్ నిర్మించాడు.
