మరాఠా నాయకుల పరస్పర కలహాలు, అసమర్థ పీష్వా రెండవ బాజీరావ్ చర్యల వల్ల రెండవ యుద్ధం సంభవించింది.
- బస్సేన్ సంధి (1802):
- రఘునాథ్ రావు కుమారుడైన రెండవ బాజీరావ్ అసమర్థ పీష్వాగా మారాడు.
- ఇండోర్ పాలకుడు యశ్వంత్‌రావ్ హోల్కర్ సోదరుడిని పీష్వా హత్య చేయించడంతో, హోల్కర్ పూణేపై దండెత్తి పీష్వాను తరిమివేశాడు.
- ప్రాణభయంతో రెండవ బాజీరావ్ బ్రిటిష్ వారి వద్దకు పారిపోయి లార్డ్ వెల్లెస్లీతో అవమానకరమైన 'బస్సేన్ సంధి' (1802) చేసుకున్నాడు.
- ఈ సంధి ద్వారా పీష్వా సైన్య సహకార పద్ధతిని (Subsidiary Alliance) అంగీకరించి బ్రిటిష్ వారి చేతిలో కీలుబొమ్మగా మారాడు.
- యుద్ధం మరియు ఫలితాలు (1803 - 1805):
- బస్సేన్ సంధిని అవమానంగా భావించిన సింధియా (దౌలత్‌రావ్), భోంస్లే (రాఘోజీ) బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించారు.
- ఆర్థర్ వెల్లెస్లీ అసై, అరగావ్ యుద్ధాలలో మరాఠా సైన్యాలను ఓడించాడు.
- డియోగావ్ సంధి (భోంస్లే), సుర్జీ-అంజన్‌గావ్ సంధి (సింధియా) ద్వారా మరాఠా రాజ్యాలు విశాల భూభాగాలను బ్రిటిష్ వారికి సమర్పించుకున్నాయి.
