← All topic notes

అష్టప్రధాన్ - శివాజీ మంత్రి మండలి వ్యవస్థ

By exambadi.inNote 07 / 21

శివాజీ పరిపాలనలో తనకు సలహాలు ఇవ్వడానికి ఎనిమిది మంది మంత్రులతో కూడిన 'అష్టప్రధాన్' వ్యవస్థను ఏర్పాటు చేశాడు.

  • అష్టప్రధానుల వివరాలు మరియు విధులు:
    1. పేష్వా (ప్రధానమంత్రి): సమగ్ర పరిపాలన మరియు ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షకుడు.
    2. అమాత్య లేదా ముజుందార్ (ఆర్థిక మంత్రి): రాజ్య ఆదాయ-వ్యయాల లెక్కల అధికారి.
    3. వాకియా-నవీస్ లేదా మంత్రి: అంతర్గత వ్యవహారాలు, గూఢచర్య సమాచార అధికారి.
    4. సుమంత్ర లేదా దబీర్ (విదేశాంగ మంత్రి): ఇతర రాజ్యాలతో విదేశీ వ్యవహారాల సమన్వయకర్త.
    5. సచివ్ లేదా సుర్నీస్ (హోం మంత్రి): ప్రభుత్వ ఉత్తర్వులు, లేఖల పర్యవేక్షకుడు.
    6. సేనాపతి లేదా సర్-ఇ-నౌబత్: సర్వ సైన్యాధ్యక్షుడు.
    7. పండిట్‌రావు (ధర్మాధికారి): మతపరమైన దానధర్మాలు, పండుగల అధికారి.
    8. న్యాయాధీశ్: ప్రధాన న్యాయమూర్తి.
  • లక్షణాలు:
    1. మంత్రుల పదవులు వంశపారంపర్యం కావు; రాజు ఇష్టానుసారం మార్పులు ఉండేవి.
    2. పండిట్‌రావు, న్యాయాధీశ్ మినహా మిగిలిన మంత్రులందరూ యుద్ధ సమయాల్లో సైన్యానికి నాయకత్వం వహించాలి.