పశ్చిమ భారతదేశంలో 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా స్వతంత్ర హిందూ రాజ్యంగా మరాఠా శక్తి ఉద్భవించింది.
- భౌగోళిక అంశాలు:
- మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాలు, కొండలు, దట్టమైన అడవులు మరాఠాలకు సహజ రక్షణగా నిలిచాయి.
- ఈ కొండ ప్రాంతాలు వారికి గెరిల్లా (గనీమీ కావా) యుద్ధ పద్ధతులు నేర్చుకోవడానికి ఎంతో అనుకూలంగా మారాయి.
- మహారాష్ట్ర ధర్మం మరియు భక్తి ఉద్యమం:
- సాధు సంతులు మరాఠా ప్రజలలో ఐక్యతను, మాతృభూమి భావనను నింపారు.
- సంత్ తుకారాం, సమర్థ రామదాస్, జ్ఞానేశ్వర్, ఏకనాథ్ తమ బోధనలతో జాతి చైతన్యాన్ని రగిలించారు.
- మరాఠీ భాషా వికాసం ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చింది.
- దక్కన్ సుల్తానేట్ల సైనిక అనుభవం:
- అహ్మద్‌నగర్, బీజాపూర్ సుల్తానుల వద్ద మరాఠా నాయకులు సైనికులుగా చేరి యుద్ధ తంత్రాలను నేర్చుకున్నారు.
- అహ్మద్‌నగర్ ప్రధాన మంత్రి మాలిక్ అంబర్ వద్ద గెరిల్లా యుద్ధ నైపుణ్యాలను అలవర్చుకున్నారు.
