శివాజీ మరణం తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్వయంగా దక్కన్‌కు వచ్చి మరాఠాలను నాశనం చేయడానికి 25 ఏళ్లు పోరాడాడు.
- ఛత్రపతి శంభాజీ (1680 - 1689):
- శివాజీ పెద్ద కుమారుడు; అత్యంత సాహసవంతుడైన యోధుడు.
- ఔరంగజేబుపై తిరుగుబాటు చేసిన మొఘల్ యువరాజు అక్బర్‌కు ఆశ్రయం ఇచ్చాడు.
- మొఘల్ సేనాని ముఖర్రబ్ ఖాన్ చేతిలో సంగమేశ్వర్ వద్ద బంధించబడ్డాడు.
- తీవ్ర చిత్రహింసలకు గురైనప్పటికీ ఇస్లాం మతంలోకి మారడానికి నిరాకరించి 1689లో వీరమరణం పొందాడు.
- ఛత్రపతి రాజారాం (1689 - 1700):
- శంభాజీ తమ్ముడు; రాజధాని రాయ్‌గఢ్ మొఘలుల చేతిలోకి వెళ్లడంతో తమిళనాడులోని జింజీ కోటకు వెళ్లాడు.
- జింజీ నుండి 8 ఏళ్ల పాటు మొఘలులపై ఎదురుదాడి చేసి మరాఠా జెండాను కాపాడాడు.
- మరాఠా నాయకులకు కొత్త భూభాగాలను జయించుకునే స్వేచ్ఛను ఇచ్చి సమాఖ్య బీజాలు వేశాడు.
