← All topic notes

మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం మరియు సాల్బాయి సంధి

By exambadi.inNote 19 / 21

పీష్వా పదవి కోసం మరాఠా నాయకుల మధ్య మొదలైన అంతర్గత కుట్రలే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జోక్యానికి దారితీశాయి.

  • యుద్ధ కారణం (రఘునాథ్ రావు ద్రోహం):
    1. యువ పీష్వా నారాయణరావును ఆయన బాబాయి రఘునాథ్ రావు (రాఘోబా) హత్య చేయించాడు.
    2. నానా ఫడ్నవీస్ నాయకత్వంలోని 12 మంది మంత్రుల మండలి (బారాభాయ్ కౌన్సిల్) నారాయణరావు చిన్నారి కుమారుడైన రెండవ మాధవరావును పీష్వాగా ప్రకటించింది.
    3. అధికార దాహంతో రఘునాథ్ రావు బ్రిటిష్ వారితో సూరత్ సంధి (1775) చేసుకుని కంపెనీ సహాయం కోరాడు.
  • యుద్ధ పరిణామాలు (1775 - 1782):
    1. నానా ఫడ్నవీస్, మహాదాజీ సింధియాల చాకచక్యంతో మరాఠా సైన్యాలు బ్రిటిష్ వారిని తలగావ్ వద్ద చుట్టుముట్టి ఓడించాయి (వాడ్‌గావ్ ఒప్పందం).
  • సాల్బాయి సంధి (1782):
    1. గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ మరాఠాలతో సాల్బాయి సంధి చేసుకున్నాడు.
    2. కంపెనీ రెండవ మాధవరావును పీష్వాగా గుర్తించింది; రఘునాథ్ రావుకు కేవలం పింఛను ఖరారైంది.
    3. ఈ సంధి ద్వారా బ్రిటిష్ మరియు మరాఠాల మధ్య 20 సంవత్సరాల పాటు శాంతి నెలకొంది.