పానిపట్ పరాజయం తర్వాత కుప్పకూలిన మరాఠా శక్తిని తన అసాధారణ ప్రతిభతో తిరిగి నిలబెట్టిన యువ పీష్వా మొదటి మాధవరావు (1761 - 1772).
- పది సంవత్సరాలలో పునరుద్ధరణ:
- మాధవరావు అత్యంత సమర్థవంతమైన పాలన అందించి నిజాంను, మైసూర్ పాలకుడు హైదరాలీని యుద్ధాల్లో ఓడించి లొంగదీసుకున్నాడు.
- రాజపుత్రులు, రోహిల్లాలపై తిరిగి మరాఠా ఆధిపత్యాన్ని నిలబెట్టాడు.
- ఢిల్లీపై పునరాధిపత్యం (1771):
- బ్రిటిష్ వారి పింఛనుదారుడిగా అలహాబాద్‌లో ఉంటున్న మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలమ్‌ను మహాదాజీ సింధియా తిరిగి ఢిల్లీ సింహాసనంపై కూర్చోబెట్టాడు.
- దీంతో మొఘల్ చక్రవర్తి మరాఠాల రక్షణలోకి వచ్చి వారికి లొంగిపోయాడు.
- తీరని నష్టం:
- క్షయవ్యాధితో మాధవరావు 1772లో తన 27వ ఏటనే అకాల మరణం చెందాడు.
- చరిత్రకారుడు గ్రాంట్ డఫ్ అభిప్రాయం ప్రకారం 'పానిపట్ మైదానం కంటే కూడా మాధవరావు అకాల మరణమే మరాఠా సామ్రాజ్యానికి కోలుకోలేని తీరని నష్టం కలిగించింది'.
