మరాఠా సామ్రాజ్యాన్ని తిరిగి పటిష్టపరచి పీష్వా పదవిని వంశపారంపర్యం చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడు బాలాజీ విశ్వనాథ్.
- మరాఠా సమాఖ్య రూపకల్పన:
- మరాఠా సర్దారులైన హోల్కర్, సింధియా, భోంస్లే, గైక్వాడ్‌లను కలుపుకుని ఉమ్మడి సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేశాడు.
- ప్రతి సర్దారుకు స్వతంత్రంగా ప్రాంతాలను జయించి పన్నులు వసూలు చేసుకునే అధికారం ఇచ్చాడు.
- ఢిల్లీ ఒప్పందం (1719) - మరాఠా మేగ్నాకార్టా:
- మొఘల్ సయ్యద్ సోదరులతో బాలాజీ విశ్వనాథ్ చారిత్రక ఒప్పందం చేసుకున్నాడు.
- మొఘల్ చక్రవర్తి ఫరూఖ్ సియార్ దక్కన్‌లోని ఆరు సుబాలలో మరాఠాలకు చౌత్, సర్దేశ్‌ముఖి వసూలు చేసుకునే చట్టబద్ధ హక్కు ఇచ్చాడు.
- చరిత్రకారుడు రిచర్డ్ టెంపుల్ ఈ ఒప్పందాన్ని 'మరాఠా సామ్రాజ్యపు మేగ్నాకార్టా' అని వర్ణించాడు.
- ఈ ఒప్పందంతో మరాఠాలు అఖిల భారత స్థాయి రాజకీయ శక్తులుగా మారారు.
