చివరి మౌర్య చక్రవర్తి బృహద్రథుడిని సంహరించి పుష్యమిత్ర శుంగుడు క్రీ.పూ. 185 లో శుంగ వంశాన్ని స్థాపించాడు.
- పుష్యమిత్ర శుంగుని పాలన:
- పుష్యమిత్రుడు మౌర్యుల వద్ద ప్రధాన సేనానిగా పనిచేశాడు.
- ఇతడు బ్రాహ్మణ మతాన్ని తిరిగి పునరుద్ధరించాడు.
- తన సార్వభౌమాధికారాన్ని చాటడానికి రెండు అశ్వమేధ యాగాలను నిర్వహించాడు.
- ఈ యజ్ఞాలను ప్రసిద్ధ సంస్కృత పండితుడు పతంజలి మహర్షి దగ్గరుండి జరిపించాడు.
- రాజధాని మరియు దండయాత్రలు:
- వీరి ప్రధాన రాజధాని పాటలీపుత్రం; రెండవ రాజధాని విదిశ (మధ్యప్రదేశ్).
- గ్రీకు దండయాత్రలను పుష్యమిత్రుడు మరియు అతని మనవడు వసుమిత్రుడు తిప్పికొట్టారు.
- అయోధ్య శాసనం పుష్యమిత్రుడు చేసిన అశ్వమేధ యాగాల గురించి స్పష్టంగా తెలుపుతుంది.
