← All topic notes

శుంగుల కాలం నాటి కళలు, సాహిత్యం మరియు పతనం

By exambadi.inNote 03 / 19

శుంగుల కాలంలో వైదిక మతం పుంజుకున్నప్పటికీ బౌద్ధ కళలకు కూడా ఆదరణ లభించింది.

  • కళలు మరియు స్తూపాల నిర్మాణం:
    1. సాంచి స్తూపానికి రాతి కంచెను (Stone Railings) మరియు తోరణాలను శుంగుల కాలంలోనే ఏర్పాటు చేశారు.
    2. మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ భార్హుత్ స్తూపాన్ని పుష్యమిత్ర శుంగుడే నిర్మించాడు.
    3. బోధగయలోని మహాబోధి ఆలయ ప్రాకారాన్ని కూడా శుంగులు అభివృద్ధి చేశారు.
  • సాహిత్య సేవలు:
    1. పతంజలి మహర్షి పాణిని అష్టాధ్యాయిపై ప్రసిద్ధ 'మహాభాష్యం' గ్రంథాన్ని రాశాడు.
    2. మనుస్మృతికి ప్రాథమిక తుది రూపం ఈ కాలంలోనే వచ్చిందని చరిత్రకారులు భావిస్తారు.
  • హెలియోడోరస్ గరుడ స్తంభం:
    1. తక్షశిల గ్రీకు రాయబారి హెలియోడోరస్ 9వ శుంగ రాజు భాగభద్రుని ఆస్థానాన్ని సందర్శించాడు.
    2. ఇతడు భాగవత (వైష్ణవ) మతాన్ని స్వీకరించి విదిశలో 'గరుడ ధ్వజ స్తంభాన్ని' ప్రతిష్టించాడు.
    3. చివరి శుంగ రాజు దేవభూతిని అతని మంత్రి వాసుదేవ కాణ్వుడు చంపి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు.