క్రీస్తు శకం 6వ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతదేశంలో బలమైన సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత కాంచీపురం పల్లవులకు దక్కుతుంది.
- రాజధాని మరియు రాజ్య విస్తరణ:
- పల్లవుల రాజధాని తమిళనాడులోని ప్రసిద్ధ కాంచీపురం నగరం.
- వీరి రాజ్య చిహ్నం నంది (వృషభం).
- పల్లవులు తొలుత శాతవాహనుల వద్ద సామంతులుగా పనిచేశారు.
- సింహవిష్ణువు (క్రీ.శ. 575 - 600):
- ఇతడు పల్లవ సామ్రాజ్యానికి నిజమైన వ్యవస్థాపకుడు.
- తమిళ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కళభ్రులను పూర్తిగా ఓడించాడు.
- కావేరి నది వరకు తన రాజ్యాన్ని విస్తరించి 'అవనిసింహ' అనే బిరుదు పొందాడు.
- మహాబలిపురంలోని ఆదివరాహ గుహాలయంలో సింహవిష్ణువు శిల్పం నేటికీ కనిపిస్తుంది.
- సంస్కృత మహాకవి భారవి (కిరాతార్జునీయం గ్రంథకర్త) సింహవిష్ణువు ఆస్థానాన్ని అలంకరించాడు.
