← All topic notes

విలియం హాకిన్స్ మరియు థామస్ రో రాయబారాలు

By exambadi.inNote 11 / 21

మొఘల్ సామ్రాజ్యంలో వర్తక రాయితీలు పొందడానికి బ్రిటిష్ రాజు మొదటి జేమ్స్ మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానానికి రాయబారులను పంపాడు.

  • కెప్టెన్ విలియం హాకిన్స్ (1608 - 1609):
    1. హాకిన్స్ 'హెక్టర్' అనే నౌకలో 1608లో సూరత్ చేరుకున్నాడు.
    2. 1609లో ఆగ్రాలోని జహంగీర్ దర్బార్‌కు వెళ్లి మొదటి జేమ్స్ రాసిన లేఖను సమర్పించాడు.
    3. హాకిన్స్ టర్కిష్, పర్షియన్ భాషలు అనర్గళంగా మాట్లాడటంతో జహంగీర్ ముగ్ధుడయ్యాడు.
    4. జహంగీర్ అతనికి 'ఇంగ్లీష్ ఖాన్' అనే బిరుదు మరియు 400 జాట్ మన్సబ్దారీ హోదా ఇచ్చాడు.
    5. అయితే పోర్చుగీసు వారి ఒత్తిడి వల్ల సూరత్‌లో ఫ్యాక్టరీ కట్టడానికి జహంగీర్ వెంటనే శాశ్వత అనుమతి ఇవ్వలేదు.
  • సర్ థామస్ రో (1615 - 1619):
    1. 1615లో మొదటి జేమ్స్ అధికారిక రాయబారిగా సర్ థామస్ రో అజ్మీర్‌లో జహంగీర్‌ను కలిశాడు.
    2. తన దౌత్య నైపుణ్యంతో మొఘల్ సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాలలో ఫ్యాక్టరీలు నిర్మించుకోవడానికి శాశ్వత ఫర్మానాను సాధించాడు.