యూరప్ నుండి సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి చేరుకున్న మొట్టమొదటి యూరోపియన్ వాస్కోడగామా.
- కాలికట్ చేరిక (1498):
- వాస్కోడగామా 1498 మే 17న కేరళ తీరంలోని కాలికట్ (కప్పాడ్ బీచ్) చేరుకున్నాడు.
- గుజరాతీ నావికుడు అబ్దుల్ మజీద్ సహాయంతో ఈయన సముద్ర మార్గాన్ని పూర్తి చేశాడు.
- కాలికట్ పాలకుడైన హిందూ రాజు 'జామోరిన్' (సామూద్రి) ఈయనకు స్వాగతం పలికాడు.
- లాభదాయకమైన వ్యాపారం:
- వాస్కోడగామా భారతదేశం నుండి తీసుకెళ్లిన నల్ల మిరియాలను యూరప్‌లో అమ్మగా ప్రయాణ ఖర్చులు పోను 60 రెట్ల లాభం వచ్చింది.
- దీనితో పోర్చుగల్ రాజు భారతదేశంతో శాశ్వత వాణిజ్యాన్ని ప్రారంభించాలని నిర్ణయించాడు.
- పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్ (1500):
- 1500లో కాబ్రాల్ నాయకత్వంలో రెండవ పోర్చుగీసు బృందం కాలికట్ వచ్చింది.
- వాస్కోడగామా 1502లో రెండవసారి భారతదేశాన్ని సందర్శించి కొచ్చిన్‌లో మొదటి పోర్చుగీసు ఫ్యాక్టరీని ప్రారంభించాడు.
