← All topic notes

తొలి బ్రిటిష్ వర్తక స్థావరాలు - సూరత్, మచిలీపట్నం, మద్రాస్

By exambadi.inNote 12 / 21

బ్రిటిష్ వారు భారతదేశ పశ్చిమ మరియు తూర్పు తీరాలలో వ్యూహాత్మకంగా వర్తక స్థావరాలను నిర్మించుకుంటూ తమ బలాన్ని పెంచుకున్నారు.

  • మొదటి ఫ్యాక్టరీలు:
    1. దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి ఫ్యాక్టరీ 1611లో మచిలీపట్నంలో ఏర్పాటయింది.
    2. 1612లో స్వాలీ యుద్ధంలో కెప్టెన్ థామస్ బెస్ట్ పోర్చుగీసు వారిని ఓడించాడు.
    3. దీనితో సంతోషించిన జహంగీర్ 1613లో పశ్చిమ తీరంలో సూరత్ వద్ద బ్రిటిష్ వారికి మొదటి శాశ్వత ఫ్యాక్టరీ అనుమతి ఇచ్చాడు.
  • బంగారు ఫర్మానా (1632):
    1. గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా 1632లో ఆంగ్లేయులకు 'గోల్డెన్ ఫర్మానా' ఇచ్చాడు.
    2. దీని ప్రకారం సంవత్సరానికి 500 పగోడాలు చెల్లించి గోల్కొండ రాజ్యంలోని ఓడరేవుల్లో ఉచితంగా వ్యాపారం చేసుకోవచ్చు.
  • మద్రాస్ నగర స్థాపన (1639):
    1. 1639లో ఫ్రాన్సిస్ డే అనే ఆంగ్లేయుడు చంద్రగిరి రాజైన వెంకటపతి రాయలు వద్ద నుండి మద్రాస్ భూమిని లీజుకు తీసుకున్నాడు.
    2. ఇక్కడ 1640లో 'ఫోర్ట్ సెయింట్ జార్జ్' (Fort St. George) అనే బలమైన కోటను నిర్మించారు.
    3. భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొట్టమొదటి కోట ఇదే.