ఢిల్లీ సుల్తానేట్ కాలంలో చిష్తీ శాఖను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఆధ్యాత్మిక యోధుడు హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా (క్రీ.శ. 1238 - 1325).
- నిజాముద్దీన్ ఔలియా (మహబూబ్-ఇ-ఇలాహీ):
- బాబా ఫరీద్ ప్రధాన శిష్యుడు; ఢిల్లీలోని గియాస్‌పూర్‌లో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు.
- ఈయనను 'మహబూబ్-ఇ-ఇలాహీ' (దేవుని ప్రేమికుడు) అని పిలుస్తారు.
- ఢిల్లీని పాలించిన ఏడుగురు సుల్తానుల పాలనను చూసినప్పటికీ, ఏ సుల్తాన్ ఆస్థానానికి వెళ్లలేదు.
- గియాసుద్దీన్ తుగ్లక్‌తో విభేదాలు వచ్చినప్పుడు 'హనూజ్ దిల్లీ దూర్ అస్త్' (ఢిల్లీ ఇంకా చాలా దూరంలో ఉంది) అన్న ప్రసిద్ధ మాట ఈయనదే.
- యోగా ప్రాణాయామ పద్ధతులను అభ్యసించడం వల్ల ఈయనను 'సిద్ధ్' అని పిలిచేవారు.
- అమీర్ ఖుస్రో - ప్రముఖ శిష్యుడు:
- నిజాముద్దీన్ ఔలియాకు అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు అమీర్ ఖుస్రో.
- ఈయనను 'తూతీ-ఇ-హింద్' (భారత చిలుక) అని పిలుస్తారు.
- సితార్, తబలా వాయిద్యాలను కనిపెట్టారు; ఖవ్వాలీ సంగీత పద్ధతిని ప్రారంభించారు.
- గురువు నిజాముద్దీన్ మరణించిన మరుసటి రోజే దుఃఖంతో అమీర్ ఖుస్రో కూడా ప్రాణాలు విడిచారు.
