← All topic notes

ప్రాంతీయ మరియు స్థానిక పాలన - ఇక్తా వ్యవస్థ

By exambadi.inNote 18 / 20

విశాలమైన సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించడానికి సుల్తానులు రాజ్యాన్ని వివిధ భాగాలుగా విభజించారు.

  • ఇక్తా వ్యవస్థ (ప్రావిన్సులు):
    1. సుల్తానేట్ రాజ్యాన్ని 'ఇక్తా'లు (రాష్ట్రాలు/ప్రావిన్సులు)గా విభజించారు; ఇక్తా అధిపతిని 'ముక్తి' లేదా 'వలీ' అనేవారు.
    2. ముక్తీలు శాంతిభద్రతలు కాపాడటం, సైన్యాన్ని పోషించడం మరియు భూమి శిస్తు వసూలు చేసి మిగిలిన మిగులు సొమ్మును ('ఫవాజిల్' - Fawazil) కేంద్ర ఖజానాకు పంపేవారు.
  • స్థానిక పరిపాలనా విభాగాలు:
    1. షిక్ (జిల్లా): ఇక్తాలు షిక్కులుగా విభజించబడ్డాయి; అధిపతి 'షిక్దార్' (శాంతిభద్రతలు).
    2. పరగణా (తాలూకా): షిక్కులు పరగణాలుగా విభజించబడ్డాయి; అధికారులు 'ఆమిల్' (పన్నుల అధికారి), 'మున్సిఫ్' (న్యాయాధికారి).
    3. గ్రామ: పరిపాలనలో చివరి విభాగం; గ్రామ పెద్దను 'ముఖద్దం' లేదా 'చౌధురి' అనేవారు; గ్రామ ఖాతాల లేఖకుడిని 'పట్వారీ' అనేవారు.