← All topic notes

ముస్లిం లీగ్ ఆవిర్భావం మరియు సూరత్ చీలిక (1907)

By exambadi.inNote 03 / 04

స్వదేశీ ఉద్యమ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి లార్డ్ మింటో ప్రోత్సాహంతో నవాబ్ సలీముల్లా, ఆగాఖాన్ నేతృత్వంలో క్రీ.శ. 1906 డిసెంబర్ 30న ఢాకాలో 'ఆల్ ఇండియా ముస్లిం లీగ్' ఏర్పాటైంది.

1906 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షతన 'స్వరాజ్' లక్ష్యాన్ని తీర్మానించినప్పటికీ, ఉద్యమ తీవ్రత మరియు పద్ధతులపై మితవాదులు, అతివాదుల మధ్య విభేదాలు పెరిగాయి. క్రీ.శ.

1907లో గుజరాత్‌లోని తపతి నదీ తీరాన రాష్‌బిహారీ ఘోష్ అధ్యక్షతన జరిగిన 'సూరత్ కాంగ్రెస్ సమావేశం'లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి కాంగ్రెస్ నిలువునా చీలిపోయింది (సూరత్ స్ప్లిట్).

బ్రిటిష్ ప్రభుత్వం అతివాదులపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది; తిలక్‌కు ఆరేళ్ల జైలు శిక్ష విధించి బర్మాలోని మాండలే జైలుకు పంపింది (అక్కడ ఆయన 'గీతారహస్యం' రాశాడు), లాలా లజపత్‌రాయ్ దేశ బహిష్కరణకు గురయ్యాడు, అరబిందో రాజకీయాల నుండి తప్పుకుని పాండిచ్చేరి ఆశ్రమం చేరాడు.