← All topic notes

వందేమాతరం / స్వదేశీ ఉద్యమం మరియు బహిష్కరణ

By exambadi.inNote 02 / 04

బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్ హాల్‌లో స్వదేశీ ఉద్యమం అధికారికంగా ప్రకటించబడింది. బంకించంద్ర ఛటర్జీ రచించిన 'వందేమాతరం' గీతం ఉద్యమ శంఖారావమైంది.

రవీంద్రనాథ్ ఠాగూర్ 'ఆమర్ సోనార్ బంగ్లా' (ప్రస్తుత బంగ్లాదేశ్ జాతీయ గీతం) రచించారు. అతివాదులు నాలుగు ప్రధాన సాధనాలను ప్రవేశపెట్టారు: 1. స్వదేశీ (స్వదేశీ వస్తువుల వాడకం), 2. బహిష్కరణ (బ్రిటిష్ వస్తువులు, పాఠశాలలు, ఉద్యోగాలు బహిష్కరించడం), 3.

జాతీయ విద్య (బెంగాల్ నేషనల్ కాలేజ్ స్థాపన - ప్రిన్సిపాల్ అరబిందో ఘోష్), 4. నిష్క్రియాత్మక నిరోధం (Passive Resistance).

తిలక్ మహారాష్ట్రలో శివాజీ, గణేష్ ఉత్సవాల ద్వారా ప్రజలను ఐక్యం చేశాడు; 'స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని సాధించి తీరుతాను' అని గర్జించాడు. చిదంబరం పిళ్ళై టుటికోరిన్‌లో స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని ప్రారంభించాడు.