← All topic notes

మింటో-మార్లే సంస్కరణలు మరియు హోమ్‌రూల్ ఉద్యమం (1916)

By exambadi.inNote 04 / 04

కాంగ్రెస్‌లో చీలికను ఆసరాగా చేసుకుని బ్రిటిష్ ప్రభుత్వం 'ఇండియన్ కౌన్సిల్స్ చట్టం - 1909' (మింటో-మార్లే సంస్కరణలు) తెచ్చి ముస్లింలకు 'ప్రత్యేక నియోజకవర్గాలను' (Separate Electorates) కేటాయించి విభజన బీజాలను శాశ్వతం చేసింది (లార్డ్ మింటోను ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ అంటారు).

ప్రజాగ్రహానికి తలొగ్గి 1911 ఢిల్లీ దర్బారులో బెంగాల్ విభజన రద్దయింది, రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మారింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో (1916) ఐరిష్ ఉద్యమ స్ఫూర్తితో 'హోమ్‌రూల్ ఉద్యమం' ప్రారంభమైంది.

బాలగంగాధర తిలక్ పూణే కేంద్రంగా (మరాఠా, కేసరి పత్రికలు), అనిబిసెంట్ అడయార్/మద్రాస్ కేంద్రంగా (న్యూ ఇండియా, కామన్వీల్ పత్రికలు) ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేశారు.

1916 లక్నో సమావేశంలో (అంబికాచరణ్ మజుందార్ అధ్యక్షుడు) మితవాదులు-అతివాదులు ఏకమయ్యారు; కాంగ్రెస్-ముస్లిం లీగ్ మధ్య 'లక్నో ఒప్పందం' కుదిరింది.

Questions for this topic will appear here once published.