← All topic notes

వ్యవసాయ వాణిజ్యీకరణ, చేతివృత్తుల నాశనం (డి-ఇండస్ట్రియలైజేషన్)

By exambadi.inNote 03 / 04

బ్రిటిష్ పాలన భారత గ్రామీణ స్వయంసమృద్ధిని పూర్తిగా ధ్వంసం చేసింది.

ఇంగ్లాండ్‌లోని పారిశ్రామిక విప్లవానికి అవసరమైన ముడిసరుకుల కోసం ఆహార పంటల స్థానంలో పత్తి, జనపనార, నీలిమందు (ఇండిగో), తేయాకు, నల్లమందు (ఓపియం) వంటి వాణిజ్య పంటలను బలవంతంగా సాగు చేయించారు.

దీనివల్ల నిరంతర ఆహార కొరత ఏర్పడి ఘోర కరువులు (1770 బెంగాల్ కరువు, 1876-78 మద్రాస్ కరువు) సంభవించి లక్షలాది మంది ఆకలితో అలమటించి చనిపోయారు.

బ్రిటిష్ యంత్రాల తయారీ వస్త్రాల దిగుమతిపై సుంకాలు ఎత్తివేసి, భారతీయ చేతివృత్తుల ఉత్పత్తులపై భారీ ఎగుమతి సుంకాలు విధించడంతో ప్రసిద్ధ డాకా మస్లిన్, చేనేత పరిశ్రమలు నాశనమయ్యాయి ('భారత మైదానాలు చేనేత కార్మికుల ఎముకలతో తెల్లబడ్డాయి' అని విలియం బెంటింక్ పేర్కొన్నాడు).

పారిశ్రామికీకరణ లేని నిరుద్యోగులంతా తిరిగి వ్యవసాయ రంగంపై ఆధారపడటంతో వ్యవసాయం సంక్షోభంలో పడింది.