భారతదేశ ఆర్థిక దోపిడీని మేధోపరంగా బట్టబయలు చేసిన తొలి జాతీయవాది దాదాభాయ్ నౌరోజీ ('భారత గ్రాండ్ ఓల్డ్ మ్యాన్').
ఇతను 1867లో 'సంపద తరలింపు సిద్ధాంతాన్ని' ప్రతిపాదించి, తన చారిత్రక గ్రంథం 'పావర్టీ అండ్ అన్-బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా' (1901)లో విడమరిచి చెప్పాడు.
భారతదేశం నుండి ఎలాంటి ప్రతిఫలం లేకుండా బ్రిటన్‌కు తరలిపోతున్న సంపదను హోమ్ ఛార్జీలు (ఈస్ట్ ఇండియా కంపెనీ డివిడెండ్లు, ఉద్యోగుల పింఛన్లు, లండన్ కార్యాలయ నిర్వహణ ఖర్చులు, బ్రిటిష్ రుణాలపై వడ్డీ) రూపంలో గుర్తించాడు. ఈ దోపిడీని ఆర్.సి.
దత్ తన 'ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా'లో, డి.ఇ. వాచా, గోపాలకృష్ణ గోఖలే తీవ్రంగా విమర్శించారు. రైల్వేలను ప్రవేశపెట్టడం కూడా ప్రజల సంక్షేమం కోసం కాక ముడిసరుకుల తరలింపు, బ్రిటిష్ వస్తువుల అమ్మకం మరియు సైనిక కదలికల కోసమేనని వారు రుజువు చేశారు.
