జ్యోతిరావ్ పూలే 1873లో బ్రాహ్మణ ఆధిపత్యంపై తిరుగుబాటుగా 'సత్యశోధక్ సమాజ్'ను స్థాపించాడు; ఆయన గ్రంథం 'గులాంగిరి'. కేరళలో నారాయణ గురు 'ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు' నినాదంతో SNDP యోగం ప్రారంభించాడు. తమిళనాడులో ఇ.వి.
రామస్వామి నాయకర్ (పెరియార్) 'ఆత్మగౌరవ ఉద్యమం' (Self-Respect Movement-1925) నడిపాడు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 1924లో 'బహిష్కృత హితకారిణి సభ', 1927లో మహద్ సత్యాగ్రహం నిర్వహించి దళితుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేశాడు.
ముస్లింలలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1875లో 'అలీఘర్ ఉద్యమం' ద్వారా ఆంగ్ల విద్యను ప్రోత్సహించి మొహమ్మడన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజీని (ప్రస్తుత AMU) స్థాపించాడు. సిక్కులలో అకాలీ ఉద్యమం గురుద్వారాలను అవినీతి మహంతుల నుండి విముక్తి చేసింది.
