← All topic notes

తిరుగుబాటుకు మూల కారణాలు: రాజకీయ, ఆర్థిక, సామాజిక

By exambadi.inNote 01 / 04

క్రీ.శ. 1857 మే 10న మీరట్‌లో ప్రారంభమైన తిరుగుబాటు బ్రిటిష్ వంద సంవత్సరాల పాలనలోని అసంతృప్తి విస్ఫోటనం. వి.డి. సావర్కర్ దీనిని 'భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం'గా అభివర్ణించాడు. కారణాలు: 1.

రాజకీయ: డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్ధాంతంతో సతారా, ఝాన్సీ, నాగ్‌పూర్ రాజ్యాలను లాక్కోవడం, అవధ్ నవాబును బలవంతంగా తొలగించడం, నానాసాహెబ్ పింఛను నిలిపివేయడం, మొఘల్ చక్రవర్తికి అవమానం జరపడం. 2.

ఆర్థిక: శాశ్వత శిస్తు, రైత్వారీ పద్ధతులతో రైతుల ఆస్తుల జప్తు, సాంప్రదాయ చేతివృత్తుల వినాశనం, ఇనామ్ కమిషన్ (1852) ద్వారా వేలాది భూములను స్వాధీనం చేసుకోవడం. 3.

సామాజిక-మత: క్రైస్తవ మిషనరీల మతమార్పిడులు, 1850 మతపరమైన అసమర్థతల చట్టం (Lex Loci Act - మతం మారినా వారసత్వ ఆస్తి దక్కడం), సతీ రద్దు మరియు వితంతు వివాహ చట్టాలను సంప్రదాయవాదులు తమ మతంలో జోక్యంగా భావించడం.