← All topic notes

వైఫల్య కారణాలు మరియు చారిత్రక ఫలితాలు (1858 చట్టం)

By exambadi.inNote 04 / 04

వైఫల్యానికి కారణాలు: యావత్ భారతదేశానికి విస్తరించకపోవడం (దక్షిణ భారతం, పంజాబ్, బెంగాల్ దూరంగా ఉన్నాయి), ఆధునిక ఆయుధాలు లేకపోవడం, జాతీయ దృక్పథం లోపించి సొంత ప్రయోజనాల కోసం పోరాడటం, స్వదేశీ రాజులు (సింధియా, హోల్కర్, నిజాం) బ్రిటిష్ వారికి మద్దతివ్వడం ('తుఫానులో బ్రేక్‌వాటర్స్‌లా కాపాడారు' అని కానింగ్ వ్యాఖ్యానించాడు), చదువుకున్న మధ్యతరగతి తిరుగుబాటును సమర్థించకపోవడం.

పర్యవసానాలు: ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయింది; 'భారత ప్రభుత్వ చట్టం - 1858' ద్వారా అధికారం నేరుగా బ్రిటిష్ రాణి చేతికి వెళ్లింది. గవర్నర్ జనరల్ హోదా 'వైస్రాయ్'గా మారింది (తొలి వైస్రాయ్ లార్డ్ కానింగ్).

1858 నవంబర్ 1న అలహాబాద్ దర్బారులో విక్టోరియా రాణి ప్రకటన (భారత ప్రజల మాగ్నాకార్టా) వెలువడింది; సంస్థానాల విలీనం నిలిపివేత, సైన్యంలో యూరోపియన్ల నిష్పత్తి పెంపు (పీల్ కమిషన్) జరిగింది.

Questions for this topic will appear here once published.