← All topic notes

సైనిక అసంతృప్తి మరియు తక్షణ కారణం (ఎన్‌ఫీల్డ్ తూటాలు)

By exambadi.inNote 02 / 04

సైన్యంలో భారతీయ సైనికులకు బ్రిటిష్ సైనికులతో సమానంగా వేతనాలు, పదోన్నతులు దక్కేవి కావు; సుబేదార్ కంటే పై పదవి లభించేది కాదు.

1856 సాధారణ సేవా నియామక చట్టం (General Service Enlistment Act) ప్రకారం సముద్రయానం తప్పనిసరి చేశారు (సముద్రయానం చేస్తే కులం పోతుందని భావించేవారు).

తక్షణ కారణం: బ్రిటిష్ సైన్యంలోకి ప్రవేశపెట్టిన నూతన 'ఎన్‌ఫీల్డ్ రైఫిల్' తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూశారనే వార్త కార్చిచ్చులా వ్యాపించింది.

తూటాను నోటితో కొరికి రైఫిల్‌లో పెట్టాల్సి రావడంతో హిందువులు (ఆవు పవిత్రం), ముస్లింలు (పంది నిషిద్ధం) తమ మతాన్ని భ్రష్టు పట్టించే కుట్రగా భావించారు.

1857 మార్చి 29న బారక్‌పూర్‌లో 34వ బెంగాల్ నేటివ్ ఇన్‌ఫాంట్రీకి చెందిన మంగళ్ పాండే లెఫ్టినెంట్ బాగ్, హ్యూసన్‌లపై కాల్పులు జరిపి తిరుగుబాటుకు తొలి అమరుడయ్యాడు.