← All topic notes

స్వాతంత్ర్య పోరాటం: గాంధీ యుగం (1919 - 1947)

By exambadi.inNote 01 / 04

మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ దక్షిణాఫ్రికాలో 21 ఏళ్ల పాటు వర్ణవివక్షపై సత్యాగ్రహ పోరాటం చేసి 1915 జనవరి 9న (ప్రవాసీ భారతీయ దివస్) భారత్‌కు తిరిగి వచ్చారు. గోపాలకృష్ణ గోఖలే సూచనతో రెండేళ్లు దేశమంతటా పర్యటించి ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నారు.

ప్రారంభ విజయాలు: 1. 'చంపారన్ సత్యాగ్రహం' (బీహార్, 1917) - తీన్‌కథియా పద్ధతి ప్రకారం రైతులను బలవంతంగా 3/20 వంతు భూమిలో ఇండిగో పండించాలనే విధానానికి వ్యతిరేకంగా గాంధీజీ భారత్‌లో చేసిన తొలి శాసనోల్లంఘన పోరాటం (రాజ్‌కుమార్ శుక్లా ఆహ్వానం; రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీకి 'మహాత్మా' బిరుదు ఇచ్చారు).

2. 'అహ్మదాబాద్ మిల్లు సమ్మె' (1918) - ప్లేగు బోనస్ కోసం కార్మికులతో కలిసి చేసిన తొలి నిరాహార దీక్ష (35% వేతన పెంపు సాధించారు).

3. 'ఖేడా సత్యాగ్రహం' (గుజరాత్, 1918) - పంట నష్టపోయిన రైతుల శిస్తు రద్దు కోసం చేసిన తొలి సహాయ నిరాకరణ పోరాటం (వల్లభాయ్ పటేల్ చేరిక).