లండన్‌లో జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాలలో గాంధీ-ఇర్విన్ ఒప్పందం (1931) తర్వాత రెండవ సమావేశానికి మాత్రమే కాంగ్రెస్ తరపున గాంధీజీ హాజరయ్యారు.
రామ్‌సే మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీజీ ఎరవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో అంబేద్కర్-గాంధీల మధ్య చారిత్రక 'పూనా ఒప్పందం - 1932' కుదిరింది.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో క్రిప్స్ మిషన్ వైఫల్యం చెందడంతో 1942 ఆగస్టు 8న బొంబాయి గోవాలియా ట్యాంక్ మైదానంలో 'క్విట్ ఇండియా ఉద్యమం' పిలుపునిచ్చారు ('డూ ఆర్ డై' - చేయండి లేదా చావండి).
అరుణా అసఫ్ అలీ, ఉషా మెహతా (భూగర్భ రేడియో), జయప్రకాష్ నారాయణ్ కీలక పాత్ర పోషించారు. సుభాష్ చంద్రబోస్ 'ఆజాద్ హింద్ ఫౌజ్' (INA) తో 'చలో ఢిల్లీ' నినాదం ఇచ్చారు.
1946 రాయల్ ఇండియన్ నేవీ (RIN) తిరుగుబాటు, క్యాబినెట్ మిషన్ ప్రణాళికల అనంతరం లార్డ్ మౌంట్‌బాటన్ ప్రణాళిక (1947 జూన్ 3) ద్వారా దేశ విభజన జరిగి 'భారత స్వాతంత్ర్య చట్టం - 1947' ప్రకారం 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం పొందింది.
