మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజల గొంతు నొక్కడానికి బ్రిటిష్ ప్రభుత్వం 'రౌలత్ చట్టం - 1919' (నల్ల చట్టం) తెచ్చింది; వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేసి విచారణ లేకుండా రెండేళ్లు జైల్లో ఉంచే అధికారం పోలీసులకు దక్కింది (No Dalil, No Vakil, No Appeal).
దీనికి వ్యతిరేకంగా పంజాబ్‌లో డాక్టర్ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూల అరెస్టును నిరసిస్తూ 1919 ఏప్రిల్ 13 (బైశాఖి పండుగ) అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో సమావేశమైన నిరాయుధులపై జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు జరిపించి వందలాది మందిని పొట్టనబెట్టుకున్నాడు.
దీనికి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ 'నైట్‌హుడ్' బిరుదును, గాంధీజీ 'కైజర్-ఇ-హింద్' పతకాన్ని త్యజించారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఖలీఫా పదవిని బ్రిటన్ అవమానించినందుకు భారత్‌లో మౌలానా ఆజాద్, అలీ సోదరులు (మహ్మద్ అలీ, షౌకత్ అలీ) నడిపిన 'ఖిలాఫత్ ఉద్యమాన్ని' గాంధీజీ హిందూ-ముస్లిం ఐక్యత కోసం సమర్థించారు.
