రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు; దీనిని సాధారణంగా 1/6 వంతుగా వసూలు చేసేవారు. ప్రధాన రెవెన్యూ అధికారిని 'సమహర్త' అని, ప్రభుత్వ ఖజానా అధిపతిని 'సన్నిధాత' అని పిలిచేవారు. కౌటిల్యుడు రెండు రకాల న్యాయస్థానాలను పేర్కొన్నాడు: 1.
ధర్మస్థీయం (సివిల్ కోర్టులు) 2. కంటకశోధన (క్రిమినల్ కోర్టులు). మౌర్యుల పాలన పటిష్టమైన గూఢచార వ్యవస్థ (గూఢపురుషులు) పై ఆధారపడింది; వీరు సంస్థాన్ (స్థిరంగా ఉండే గూఢచారులు), సంచారి (తిరుగుతూ సమాచారం సేకరించే గూఢచారులు)గా పనిచేసేవారు.
