సామ్రాజ్యాన్ని 5 ప్రధాన ప్రావిన్సులుగా (చక్రాలు) విభజించారు: 1. ఉత్తరాపథం (తక్షశిల) 2. అవంతిరథం (ఉజ్జయిని) 3. ప్రాచి/మధ్యప్రాంతం (పాటలీపుత్రం) 4. దక్షిణాపథం (సువర్ణగిరి) 5. కళింగ (తోసలి).
ప్రావిన్సుల అధిపతులుగా రాజకుమారులు (కుమార/ఆర్యపుత్ర) ఉండేవారు.
మెగస్తనీస్ ప్రకారం రాజధాని పాటలీపుత్ర నగర పాలనను 30 మంది సభ్యులతో కూడిన 6 కమిటీలు (ఒక్కొక్క దాంట్లో 5 గురు సభ్యులు - పరిశ్రమలు, విదేశీయులు, జనన-మరణాలు, వాణిజ్యం, అమ్మకపు పన్ను వసూలు) నిర్వహించేవి.
