మౌర్యుల కాలంలో రాతితో కూడిన శాశ్వత కట్టడాలు ప్రారంభమయ్యాయి. అశోకుని ఏకశిలా స్తంభాలు (Monolithic Pillars) చునార్ ఇసుకరాతితో చేయబడి, అద్భుతమైన మెరుగును (Polishing) కలిగి ఉన్నాయి.
సారనాథ్‌లోని చతుర్ముఖ సింహ స్తంభం భారత జాతీయ చిహ్నంగా స్వీకరించబడింది. బీహార్‌లోని బరాబర్ కొండలలో అశోకుడు అజీవకుల కోసం సుదామ, లోమశ ఋషి గుహలను తొలిపించాడు. దీదార్‌గంజ్ యక్షిణి శిల్పం మౌర్య ప్రజా కళకు నిదర్శనం.
చివరి మౌర్య రాజు బృహద్రథుడిని క్రీ.పూ. 185లో పుష్యమిత్ర శుంగుడు వధించాడు.
