మగధ కరువు సమయంలో భద్రబాహు నేతృత్వంలో దక్షిణాదికి (శ్రావణబెళగొళ) వెళ్లినవారు 'దిగంబరులు' (నగ్నత్వం పాటించేవారు) కాగా, స్థూలభద్రుని నాయకత్వంలో మగధలోనే ఉండి తెల్లని వస్త్రాలు ధరించినవారు 'శ్వేతాంబరులు'. మొదటి జైన సంగీతి క్రీ.పూ.
300లో పాటలీపుత్రంలో స్థూలభద్రుని అధ్యక్షతన జరిగి 12 అంగాలు సంకలనం చేయబడ్డాయి. రెండవ జైన సంగీతి క్రీ.శ. 512లో వల్లభి (గుజరాత్) లో దేవర్థి క్షమాశ్రమణుడి నేతృత్వంలో జరిగి తుది గ్రంథాలు లిఖితమయ్యాయి.
మౌర్య చంద్రగుప్తుడు శ్రావణబెళగొళలో సల్లేఖన వ్రతం ద్వారా ప్రాణత్యాగం చేశాడు.
