← All topic notes
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › జైన మతం - తీర్థంకరులు, వర్ధమాన మహావీరుడు మరియు సిద్ధాంతాలు

వర్ధమాన మహావీరుని జీవితం

Topic 2 of 4 in జైన మతం - తీర్థంకరులు, వర్ధమాన మహావీరుడు మరియు సిద్ధాంతాలు. Read this note, then practice its questions.

By exambadi.inNote 02 / 04

24వ మరియు చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు (క్రీ.పూ. 540 - 468). వైశాలి సమీపంలోని కుందగ్రామంలో జ్ఞాత్రిక క్షత్రియ వంశంలో జన్మించాడు; తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశల (లిచ్ఛవి యువరాణి), భార్య యశోధ.

30వ ఏట సన్యసించి, 12 ఏళ్ల కఠిన తపస్సు అనంతరం 42వ ఏట జృంబికాగ్రామం వద్ద రుజుపాలిక నదీ తీరాన సాల వృక్షం కింద 'కైవల్య' (సర్వోన్నత జ్ఞానం) పొందాడు. ఇంద్రియాలను జయించి 'జిన' (విజేత), కేవలిన్, మహావీరుడిగా ప్రసిద్ధి చెందాడు.

72వ ఏట బీహార్‌లోని పావాపురిలో నిర్వాణం చెందాడు.