మొహెంజోదారోలో గొప్ప ధాన్యాగారం, నాగరికతలో అతిపెద్ద భవనంగా పేర్కొనబడిన మహాస్నానవాటిక, సభామందిరం, శంఖపు పలకలు, పశుపతి మహాదేవుడు లేదా ఆదిశివుడు ముద్ర, కాంస్యంతో తయారైన నగ్న నర్తకి విగ్రహం, గడ్డం ఉన్న వ్యక్తి సబ్బురాయి విగ్రహం, సమూహంగా లభించిన మానవ అస్థిపంజరాలు, మాతృదేవత మట్టి బొమ్మలు, నేసిన పత్తి వస్త్రపు భాగం, ఇటుక బట్టీలు, రెండు మెసపటోమియా ముద్రలు, పెద్ద సంఖ్యలో ముద్రలు మరియు పాచికలు లభించాయి. పుస్తకం ప్రకారం ఇక్కడ 1398 ముద్రలు లభించగా అవి మొత్తం నాగరికతలో లభించిన ముద్రల్లో సుమారు అరవై ఐదు శాతం.
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › Harappan/Indus Civilization
మొహెంజోదారోలో లభించిన ముఖ్య పురావస్తు అవశేషాలు
Topic 6 of 17 in Harappan/Indus Civilization. Read this note, then practice its questions.
