గుప్తుల కాలం శాస్త్రీయ విప్లవానికి ప్రతీక. ఆర్యభట్ట (క్రీ.శ.
476) 'ఆర్యభట్టీయం', 'సూర్యసిద్ధాంతం' రచించాడు; సున్నా (Zero) విలువను, దశాంశ పద్ధతిని ప్రామాణీకరించాడు; భూమి గుండ్రంగా ఉందని, తన అక్షం చుట్టూ తాను తిరుగుతుందని, సూర్య-చంద్ర గ్రహణాలకు శాస్త్రీయ కారణాలను ప్రపంచంలో తొలిసారి వివరించాడు.
వరాహమిహిరుడు బృహత్సంహిత, పంచసిద్ధాంతిక, బృహజ్జాతక గ్రంథాలను రచించాడు. బ్రహ్మగుప్తుడు గురుత్వాకర్షణ శక్తిని ముందే ఊహించాడు (బ్రహ్మస్ఫుట సిద్ధాంతం). ధన్వంతరి, వాగ్భటుడు (అష్టాంగ సంగ్రహం) ప్రసిద్ధ వైద్యులు.
