← All topic notes
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › గుప్తుల స్వర్ణయుగం - కళలు, సాహిత్యం మరియు శాస్త్ర సాంకేతికతలు

సంస్కృత సాహిత్యం మరియు విక్రమాదిత్యుని నవరత్నాలు

Topic 2 of 4 in గుప్తుల స్వర్ణయుగం - కళలు, సాహిత్యం మరియు శాస్త్ర సాంకేతికతలు. Read this note, then practice its questions.

By exambadi.inNote 02 / 04

రెండవ చంద్రగుప్తుని ఆస్థానాన్ని 'నవరత్నాలు' (తొమ్మిది మంది పండితులు) అలంకరించారు: కాళిదాసు, అమరసింహుడు, ధన్వంతరి, వరాహమిహిరుడు, వరూచి, ఘటకర్పర, క్షపణకుడు, శంకు, వేతాళభట్టు.

కాళిదాసును 'భారతీయ షేక్స్పియర్' అంటారు; నాటకాలు (అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం), కావ్యాలు (రఘువంశం, కుమారసంభవం), ఖండకావ్యాలు (మేఘదూతం, ఋతుసంహారం) రచించాడు.

విశాఖదత్తుడు (ముద్రారాక్షసం, దేవీచంద్రగుప్తం), శూద్రకుడు (మృచ్ఛకటికం), విష్ణుశర్మ (పంచతంత్రం), అమరసింహుడు (అమరకోశం) ఇతర ముఖ్యులు.