రెండవ చంద్రగుప్తుడు (క్రీ.శ. 380 - 415) 'విక్రమాదిత్య' బిరుదుతో పాలించాడు. పశ్చిమ శక క్షత్రపులను పూర్తిగా అంతమొందించి 'శకారి' బిరుదు పొందాడు, ఉజ్జయినిని రెండవ రాజధానిగా చేసుకున్నాడు.
మెహ్రౌలీ ఇనుప స్తంభ శాసనం (ఢిల్లీ) ఇతని విజయాలను చాటుతుంది. చైనా యాత్రికుడు ఫాహియాన్ ఇతని కాలంలోనే భారత్‌ను సందర్శించాడు. గుప్తుల పరిపాలన మౌర్యుల వలె కాకుండా అత్యంత వికేంద్రీకృత, భూస్వామ్య (Feudal) స్వభావాన్ని కలిగి ఉంది.
సామ్రాజ్యాన్ని భుక్తులుగా (ఉపరికులు పర్యవేక్షకులు), విషయాలుగా (విషయపతులు) విభజించారు.
