మొదటి చంద్రగుప్తుని కుమారుడు సముద్రగుప్తుడు (క్రీ.శ. 335 - 375) గుప్తులలో అజేయమైన సైనిక విజేత. చరిత్రకారుడు వి.ఎ. స్మిత్ ఇతడిని 'ఇండియన్ నెపోలియన్' అని వర్ణించాడు.
ఆస్థాన కవి హరిసేనుడు సంస్కృతంలో (చంపూ శైలిలో) రచించిన 'అలహాబాద్ స్తంభ శాసనం' (ప్రయాగ ప్రశస్తి) సముద్రగుప్తుని విజయాలను వివరిస్తుంది: ఉత్తర భారతదేశంపై 'దిగ్విజయం' (9 మంది రాజుల నిర్మూలన), దక్షిణాపథంపై 'గ్రహణమోక్షానుగ్రహ' విధానం (12 మంది రాజులను ఓడించి రాజ్యాన్ని తిరిగి ఇవ్వడం).
అశ్వమేధ యాగం చేసి నాణేలపై వీణ వాయిస్తున్న చిత్రాలను ముద్రించాడు (కవిరాజ బిరుదు).
