ప్రజలతో నేరుగా శాసనాల ద్వారా మాట్లాడిన తొలి భారతీయ చక్రవర్తి అశోకుడు. శాసనాలు నాలుగు రకాలు: 14 ప్రధాన శిలాశాసనాలు (Major Rock Edicts), లఘు శిలాశాసనాలు, 7 స్తంభ శాసనాలు (Pillar Edicts), గుహా శాసనాలు (బరాబర్ గుహలు).
శాసనాలలో అధికభాగం ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి; వాయవ్య భారతంలో ఖరోష్టీ లిపి (షాబాజ్‌గర్హి, మాన్సేహ్రా), ఆఫ్ఘనిస్తాన్‌లో గ్రీకు, అరామిక్ లిపులు (కాందహార్ ద్విభాషా శాసనం) వాడబడ్డాయి.
